Jun 10,2021 21:40

తిరుమల : తిరుమల శ్రీవారిని సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వి.రమణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయనకు టిటిడి చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి, ఇఒ జవహర్‌ రెడ్డి, అదనపు ఇఒ ఎవి.ధర్మారెడ్డి, ఎమ్మెల్యే కరుణాకర్‌ రెడ్డి పుష్ప గుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయక మండపంలో టిటిడి అధికారులు శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ అయిన మొదటిసారి ఆయన తిరుమలకు రావడంతో జిల్లా యంత్రంగం, టిటిడి ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.