Sep 15,2021 22:06

matladutuna jarina

సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడులు
ప్రజాశక్తి-మండవల్లి
వరి సాగులో సస్యరక్షణ చర్యలు తప్పక పాటించి అధిక దిగుబడులు సాధించొచ్చునని వ్యవసాయ శాఖ అధికారిణి షేక్‌ జరీనా పేర్కొన్నారు. 14 వారాల పొలంబడి కార్యక్రమంలో భాగంగా ఆమె బుధవారం అల్లినగరం గ్రామంలోని సత్యనారాయణ పొలంలో పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరి పైరును ఆశించే చీడపీడలను మొదట్లోనే గమనించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. సమగ్ర పురుగుల యాజమాన్యం గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఆకు కత్తిరింపు, పిలకల తొలగింపు వంటి ప్రయోగాలను రైతులకు చేసి చూపించారు. అనంతరం రైతులకు సబ్సిడీపై వచ్చిన వేపనూనెను అందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.