Jul 04,2022 00:01

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఆదినారాయణ

  ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణ నిర్ణయయాన్ని వెనక్కి తీసుకుంటామని ప్రధాని మోడీ ప్రకటించిన తరువాతనే అల్లూరి విగ్రహావిష్కరణ చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి ఆదినారాయణ డిమాండ్‌ చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటకమిటీ ఆధ్వర్యాన ఆదివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా భీమవరం వస్తున్న ప్రధాని మోడీకి నల్లజెండాలతో నిరసన తెలపాలని పోరాట కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. 4వ తేదీన ప్రతి ఉక్కు ఉద్యోగీ నల్ల బ్యాడ్జీ ధిరించి విధుల్లో పాల్గోవాలని, నల్ల జెండాలతో నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు నీరుకొండ రామచంద్రరావు, గంధం వెంకట్రావు, వైటి దాసు, గణపతిరెడ్డి, విళ్లా రామ్మోహన్‌ కుమార్‌, వరసాల శ్రీనివాస్‌, జె.రామకృష్ణ, కరణం సత్యారావు, మహాలక్ష్మినాయుడు, శ్రీనివాసరాజు, నందికి తాతారావు, బోసు బాబు, నమ్మి రమణ, గంగవరం గోపి తదితరులు పాల్గొన్నారు.