May 05,2021 00:51

ఆర్‌డిఒ కార్యాలయం వద్ద నినాదాలు చేస్తున్న గ్రామస్తులు

ప్రజాశక్తి - అనకాపల్లి
ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించకుండా చేపడుతున్న స్టోన్‌ క్రషర్‌ నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని ఆర్‌డిఓ కార్యాలయం వద్ద మొండిపాలెం ప్రజలు మంగళవారం ధర్నా చేశారు. స్టోన్‌ క్రషర్‌కు పంచాయతీ తీర్మానం, ప్లాన్‌ అప్రూవల్‌ వంటివేమీలేవని ఆర్‌డిఓకు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ ప్రమాదం, పంట నష్టాలను పరిగణనలోకి తీసుకొని క్రషర్‌ నిర్మాణ పనులు నిలిపివేయాలన్నారు. తహశీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చినా స్పందించలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎపి కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎ. బాలకృష్ణ, అఖిలభారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి పిఎస్‌.అజరు కుమార్‌, సిపిఐ నాయకులు వైఎన్‌.భద్రం, వియ్యపు రాజు తదితరులు పాల్గొన్నారు.