Sep 15,2021 23:45

ప్రజాశక్తి-ఒంగోలు క్రైం: మద్యం మత్తులో స్ట్రీట్‌ఫైట్‌ చేసుకున్న రెండు గ్రూపులపై రౌడీషీట్‌ తెరిచినట్లు ఒంగోలు డిఎస్‌పి యు.నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక తాలూకా పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గత శనివారం స్థానిక మంగమూరు డొంకలోని ఆశ్రమం వద్ద అదే ప్రాంతానికి చెందిన చిట్టెంరెడ్డి రామక్రిష్ణారెడ్డి, పిడుగు రామక్రిష్ణారెడ్డి మద్యం సేవించారు. అక్కడ కబాడీపాలెంకు చెందిన పేర్లి విజయవర్ధనరాజు అలియాస్‌ బుడ్డ వారికి తారసపడ్డాడు. దీంతో వారిరువురూ పాతకక్షలు మనసులో పెట్టుకుని విజరువర్ధన్‌రాజును కొట్టారు. దీంతో విజరువర్ధన్‌రాజు, అతని సోద రుడు పేర్లి జోషి, అతని మిత్రులు బొడ్డు సన్నీ, మారాల చంద్రశేఖర్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం తెలియచేయడంతో వారందరూ వచ్చి.. చిట్టెంరెడ్డి రామక్రిష్ణారెడ్డి, పిడుగు రామక్రిష్ణారెడ్డిపై రాళ్లతో, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘర్షణలో మొత్తం ఆరుగురు నిందితులు కాగా ఐదుగురుని పోలీసులు అరెస్టు చేశారు. విజరువర్ధన్‌ రాజు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. డిశ్చార్జి అయిన వెంటనే అతనిని కూడా అరెస్టు చేస్తామని డీఎస్పీ తెలిపారు. సమా వేశంలో తాలూకా సిఐ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.