
ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'సత్తిగాని రెండు ఎకరాలు'. అభినవ్ దండా దర్శకుడు. ఈ సినిమా మార్చి 17 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కావాల్సింది. కానీ నిర్మాతలు వాయిదా వేశారు. ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమోషన్స్, కామెడీ, ట్విస్టులున్న కథను రూపొందించారు మేకర్స్. నటుడు జగదీశ్ ప్రతాప్ బండారి హీరోగా నటించాడు. 'వెన్నెల' కిశోర్, బిత్తిరి సత్తి, మోహనశ్రీ సురాగ, రాజ్ తిరందాసు, అనీషా దామా ఇతర కీలక పాత్రలను పోషించారు. గ్రామీణ ప్రాంతాల జీవితాలకు అద్దంపట్టేలా ఈ సినిమాను అభినవ్ తెరకెక్కించాడు. జగదీష్ ప్రతాప్ ఇప్పటి వరకు చేయనటువంటి ఓ డిఫరెంట్ రోల్‌లో కనిపించబోతున్నాడు. కూతురు కోసం సర్వస్వం త్యాగం చేయాలనుకునే తండ్రి పాత్రను అతను పోషించాడు.