Apr 07,2021 10:11

సూడాన్‌ : సూడాన్‌లో మళ్లీ హింసాత్మక ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 56 మంది మరణించినట్లు ఐక్యరాజ్యసమితి (యుఎన్‌) ప్రకటించింది. హింస ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఘర్షణ అనంతరం పశ్చిమ డర్ఫూర్‌, ఎల్‌ జెనీవాలో అత్యవసర స్థితిని ప్రకటించారు.
   2019 ఏప్రిల్‌లో ఒమర్‌ అల్‌-బషీర్‌ ప్రభుత్వాన్ని పడగొట్టినప్పటి నుంచి సుడాన్‌లోని డార్ఫూర్‌ ఇతర ప్రాంతాలలో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బషీర్‌తో పోరాడిన కొన్ని తిరుగుబాటు గ్రూపులతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ మళ్లీ హింస పెరుగుతుండటంతో భయాందోళన చెందిన అక్కడి ప్రజలు వేరే ప్రాంతాలకు తరలివెళ్లిపోతున్నారు.
   పశ్చిమ డర్ఫూర్‌ ప్రావిన్స్‌లోని జెనీనాలో మసాలిట్‌, అరబ్‌ అనే రెండు గిరిజన తెగలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు 56 మంది మరణించగా, 132 మందికి గాయపడినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. గతేడాది శాంతి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఇంత పెద్ద స్థాయిలో మళ్లీ హింస జరిగిందని ఆవేదన వ్యక్తపరిచింది. తుపాకులు, గ్రెనెడ్లతో కాల్పులు జరుపుకుంటుండటంతో మరణాల సంఖ్య పెరుగుతోందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.