Jun 15,2021 13:37

న్యూఢిల్లీ : కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాల్సివారు ఇక నుండి సులువుగా వ్యాక్సిన్‌ అందుబాటులో ఉన్న స్లాట్లను చూడొచ్చు.. అపాయింట్‌మెంట్‌ను బుక్‌ చేసుకోవచ్చు.. ఈ కొత్త ఫీచర్‌ను డిజిటల్‌ పేమెంట్స్‌ యాప్‌ పేటీఎం అందుబాటులోకి తీసుకొచ్చింది. గత మే నెలలోనే వ్యాక్సిన్‌ ఫైండర్‌ ఫీచర్‌ను పేటీఎం అందుబాటులోకి తెచ్చింది. తాజాగా బుకింగ్‌ సదుపాయం కూడా కల్పించింది.
    ఇటీవల కొవిన్‌ హెడ్‌ ఆర్‌ఎస్‌ శర్మ మాట్లాడుతూ... పేటీఎం సహా మరో పది వరకూ సంస్థలు వ్యాక్సిన్‌ బుకింగ్స్‌ కోసం అనుమతి ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు. పేటీఎం వినియోగదారులుకొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లు వేసే తమకు దగ్గరలోని వ్యాక్సినేషన్‌ సెంటర్లను సులువుగా తెలుసుకొని అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకోవడానికి ఇది పనికొస్తుందని పేటీఎం సంస్థ పేర్కొంది.