Feb 06,2023 20:34

డాక్టరేట్‌ అందుకుంటున్న సురేఖ

ప్రజాశక్తి-విజయనగరం : స్థానిక తోట పాలెంలో గల సత్య డిగ్రీ, పీజీ కళాశాల పూర్వ విద్యార్థి పి.సురేఖకు ఇటీవల ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ వచ్చింది. ఆమె చిత్తూరులో సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్రంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గా పని చేస్తున్నారు. 'నోవల్‌ కేటాలిక్‌ అప్లికేషన్స్‌ ఆఫ్‌ కాపర్‌ పైరేట్‌ నానో పార్టికల్స్‌ అండ్‌ ఆప్టికల్‌ అప్లికేషన్‌ ఆఫ్‌ నానో కాంపోజిట్‌'' అనే అంశంపై పరిశోధనలు చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ అయిన డాక్టర్‌ పాల్‌ డగ్లస్‌, డాక్టర్‌ హిమబిందు గైడెన్స్‌ లో పరిశోధనలు చేశారు. సురేఖ సత్య కళాశాలలో 2001-03లో ఇంటర్మీడియట్‌, 2003-6 బిఎస్‌సి చదివారు. ఈ సందర్భంగా ఆమెను కళాశాల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ డాక్టర్‌ బొత్స ఝాన్సీ లక్ష్మీ, సంచాలకులు డాక్టర్‌ ఎం.శశిభూషణ రావు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎంవి సాయి దేవ మణి తదితరులు అభినందించారు.