Jun 10,2021 18:43

కష్ట కాలంలో తన వంతు సాయం అందిస్తూ ఉండే నటుడు సూర్య కరోనా సెకండ్‌ వేవ్‌లో సహాయార్థం తమిళనాడు ప్రభుత్వనిధికి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చాడు. తాజాగా తన ఫ్యాన్‌ క్లబ్‌కు చెందిన 250 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5000 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఆ డబ్బుని నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేశారు. కరోనా వల్ల అభిమానుల కుటుంబాల పరిస్థితులని చూసి సూర్య ఈ నిర్ణయం తీసుకున్నారు.