Oct 03,2022 23:05

సూర్య, చంద్రప్రభ వాహనాలపై శ్రీనివాసుడు

ప్రజాశక్తి- తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడోరోజు సోమవారం ఉదయం 8 నుంచి 10గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు మత్స్యనారాయణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
సూర్యప్రభ వాహనం - ఆయురారోగ్యప్రాప్తి
బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు ఉదయం సూర్యనారాయణుడు దివ్యకిరణ కాంతుల్లో పకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వద్ధి పొందుతున్నారు. సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. రాత్రి 7గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీమలయప్ప స్వామివారు అనుగ్రహించారు. వాహనసేవలో పెద్దజీయర్‌ స్వామి, చిన్నజీయర్‌స్వామి, టిటిడి ఛైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో ఎవి.ధర్మారెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు మూరంశెట్టి రాములు, మారుతి ప్రసాద్‌, మధుసూదన్‌ యాదవ్‌, ఢిల్లీ స్థానికి సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జెఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహకిషోర్‌, ఆలయ డెప్యూటి ఈవో రమేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.
వాహనసేవల్లో కనువిందుగా కళారూపాలు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల వాహనసేవల్లో భక్తులకు కనులవిందుగా అపురూపమైన కళారూపాలు ప్రదర్శిస్తున్నామని టిటిడి ధార్మిక ప్రాజెక్టుల అధికారి విజయలక్ష్మి చెప్పారు. తిరుమల రాంభగీచా-2లో గల మీడియా సెంటర్‌లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరితో పాటు ఉత్తరాదికి చెందిన మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి వివిధ కళారూపాలను కళాకారులు ప్రదర్శిస్తున్నారని, గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. ఆయా రాష్ట్రాల జానపద కళారూపాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. వాహనసేవల సమయంలో విశిష్టతను తెలియజేసేందుకు ప్రముఖ పండితులతో వ్యాఖ్యానం చేయిస్తున్నామని వెల్లడించారు. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు, శ్రీవేంకటేశ్వర సంగీత, నత్య కళాశాల ఆధ్వర్యంలో బ్రహ్మౌత్సవాల వాహనసేవలతోపాటు తిరుమల, తిరుపతిలోని పలు వేదికలపై ఆధ్యాత్మిక, ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
91 కళాబృందాల్లో 1906 మంది కళాకారులు
వాహన సేవల్లో హిందూ ధర్మప్రచార పరిషత్‌ నుండి 52, దాస సాహిత్య ప్రాజెక్టు నుండి 25, అన్నమాచార్య ప్రాజెక్టు నుండి 14 కలిపి మొత్తం 91 కళాబందాల్లో 1906 మంది కళాకారులు పాల్గొన్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ నుండి 63 బందాల్లో కళాకారులు పాల్గొన్నారని, వీరు గరగల భజన, చెక్క భజన, పిల్లన గ్రోవి భజన, తప్పెట గుళ్లు, లంబాడీ నత్యం, కోలాటం, కీలుగుర్రాలు, బళ్లారి డప్పులు, వేషధారణ కళారూపాలను ప్రదర్శించారని తెలియజేశారు. తెలంగాణ నుండి రెండు బందాలు చెక్క భజన, కోలాటం ప్రదర్శించారని చెప్పారు. కర్ణాటక నుండి ఐదు బందాలు విచ్చేసి మహిళా తమటే, డొల్లు కునిత, పూజ కునిత, సోమన కునిత, కంసాల కళారూపాలను ప్రదర్శించారని తెలిపారు. తమిళనాడు నుండి 12 బందాలు వచ్చాయని, వీరు కరకట్టం, పంపై, ఒయిలాట్టం, పోయికల్‌ కుత్తిరై, మాయిలాటం, కాళియాట్టం, కోలాటం, మహారాష్ట్ర నుండి రెండు బందాలు డిండి భజన, డ్రమ్స్‌ వాయిద్యం, ఒడిశా నుండి ఒక బందం, కేరళ నుండి ఒక బందం, పాండిచ్చేరి నుండి రెండు బందాలు స్థానిక కళారూపాలను ప్రదర్శించారని వివరించారు. అనంతరం దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్‌ ఆకెళ్ల విభీషణశర్మ, ఎస్వీ సంగీత, నత్య కళాశాల ప్రిన్సిపాల్‌ సుధాకర్‌ మాట్లాడుతూ ఆయా విభాగాల ఆధ్వర్యంలో చేపడుతున్న కళాప్రదర్శనలను తెలియజేశారు. టిటిడి ప్రజాసంబంధాల అధికారి టి.రవి, సహాయ ప్రజాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ, ధార్మిక ప్రాజెక్టుల ఏఈవో సత్యనారాయణ, సూపరింటెండెంట్‌ కాంతికుమార్‌ పాల్గొన్నారు.