Feb 02,2023 02:28
డాక్టర్‌ బాబూరావును సన్మానిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-చీరాల: అంబేద్కర్‌ ఐడియాలజీ ఫోరం మరియు రోటరీ క్లబ్‌ అధ్యక్షులుగా డాక్టర్‌ ఐ బాబూరావు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని, ఆయన సేవలను గుర్తించి బాపట్ల జిల్లా షూటింగ్‌ బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఆయనను నియమిస్తున్నట్టు బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్ర తెలిపారు. డాక్టర్‌ బాబూరావును ఆయన మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ ఇప్పటికే ప్రజాసేవలో తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న డాక్టర్‌ బాబూరావు తమ సహకారంతో షూటింగ్‌ బాల్‌ అసోసియేషన్‌ను ముందుకు నడిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఈటి రత్నకుమార్‌ పాల్గొన్నారు.