Aug 06,2022 23:17

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: మహానీయుల త్యాగాలు దేశ భవిష్యత్తుకు మార్గాలని యర్రగొండపాలెం ప్రభుత్వ మోడల్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీధర్‌ నాయుడు తెలిపారు. శనివారం ఆ కళాశాల ఆధ్వర్యంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 75 మంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలతో విద్యార్ధులు యర్రగొండపాలెం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సంధర్భంగా శ్రీధర్‌ నాయుడు మాట్లాడుతూ 75 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఘనంగా నిర్వహించాలని తెలిపారు. స్వాతంత్య్రం కోసం ఎందరో చేసిన త్యాగాలను ప్రస్తుత తరానికి తెలియజెప్పి వారిలో స్పూర్తి నింపే విధంగా చైతన్యం తీసుకురావాలని కోరారు. ఇంకా ఎంఈఓ పి ఆంజనేయులు, అధ్యాపకులు పి ప్రదీప్‌, రామకోటయ్య మాట్లాడారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.