
సిబ్బందిని సన్మానిస్తున్న ప్రజాప్రతినిధులు
ప్రజాశక్తి-భట్టిప్రోలు: మండలంలోని కొనేటిపురం, ఆళ్ళముడి గ్రామ పంచాయతీ లకు జగనన్న స్వచ్ఛత సేవ అవార్డులు దక్కటంతో అందుకు కృషి చేసిన సిబ్బందిని శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో సన్మానించారు. ఎంపిపి డివి లలితకుమారి, జెడ్పిటిసి ఉదరు భాస్కరి చేతుల మీదుగా సన్మానించారు. ఆళ్ళముడి గ్రామ సర్పంచ్ పెద్దిశెట్టి రాంబాబు, కార్యదర్శి ప్రదీప్ కుమార్, ఈఓపిఆర్‌డి సిహెచ్ శేఖర్ బాబు, కొనేటిపురం గ్రామ కార్యదర్శి వెంకటేష్ బాబు, ఇంజనీరింగ్ అసిస్టెంట్, వాలంటీర్లను సన్మానించారు. మండలంలో మిగిలిన 13 గ్రామ పంచాయతీలు కూడా జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగస్వాములై స్వచ్ఛత పాటించాలని ఎంపిపి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి నన్నెపాముల చంటి, నాయకులు మల్లేశ్వరరావు, బాలాజీ, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.