Dec 02,2022 00:18

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న నాగజగదీష్‌, కుమార్‌, బత్తుల

ప్రజాశక్తి- అనకాపల్లి
రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు, ఖర్చులపై శ్వేత పత్రం విడుదల చేయాలని టిడిపి పార్లమెంట్‌ అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు డిమాండ్‌ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో 'ఇదేం కర్మ' పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి మూడున్నర ఏళ్ల పాలనలో రూ.5 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. ఇందులో కేవలం లక్షా 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిగిలిన మొత్తాన్ని స్వాహా చేశారని ఆరోపించారు. టిడిపి మాడుగుల నియోజకవర్గం ఇన్‌ఛార్జి పివిజి.కుమార్‌ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం సాగు, తాగునీటి ప్రాజెక్టులకు ఒక్క రూపాయి విడుదల చేయలేదన్నారు. చోడవరం ఇన్‌ఛార్జి బత్తుల తాతయ్య బాబు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని తెలిపారు.
వైసిపి పాలనలో అభివృద్ధి కంటే అవినీతి ఎక్కువ
వైసిపి ప్రభుత్వ మూడున్నర ఏళ్లలో అభివృద్ధి కన్నా అవినీతి ఎక్కువగా జరిగిందని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీలా గోవింద సత్యనారాయణ విమర్శించారు. మండలంలోని చింత నిప్పుల అగ్రహారంలో గురువారం 'ఇదేం కర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అనకాపల్లికి పట్టిన కర్మ అని ఎద్దేవా చేశారు. తుమ్మపాల ఫ్యాక్టరీని మూత వేయించారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కోట్ని బాలాజీ, మళ్ల సురేంద్ర, కాయల మురళి, శరగడం ఆదిబాబు, ముమ్మిన పైడిరాజు, దాడి పెంటారావు, దంట్ల సూరిబాబు, మద్దాల వెంకటేష్‌, పివి.నాయుడు, సందిన సునీల్‌, మరపు రెడ్డి సత్యనారాయణ, చందక నరసింగరావు పాల్గొన్నారు.