Jul 27,2021 07:31
  • మహిళల 400మీ. ఫ్రీస్టైల్‌లో ఆస్ట్రేలియాకు స్వర్ణం

ఒలింపిక్స్‌ స్విమ్మింగ్‌ విభాగంలో అమెరికా ఆధిపత్యానికి గండి పడింది. సోమవారం జరిగిన మహిళల 400మీ. ఫ్రిస్టైల్‌ స్విమ్మింగ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన అరియార్న్‌ టిట్మస్‌ స్వర్ణ పతకాన్ని ఎగరేసుకుపోయింది. ఆమె 3నిమిషాల 56.69సెకన్లలో గమ్యానికి చేరి రికార్డు నెలకొల్పింది. ఇక 2వ స్థానంలో నిలిచిన ఒలింపిక్‌ ఛాంపియన్‌, ప్రపంచ రికార్డు హోల్డర్‌ అమెరికా అమ్మాయి లెడెక్కే 3నిమిషాల 57.36తో రజిత పతకానికే పరిమితమైంది. ఇక చైనాకు చెందిన బి.జె. లీ 4నిమిషాల 1.08సెకన్లలో గమ్యానికి చేరి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. పురుషుల 100మీ. బ్యాక్‌స్ట్రోక్‌లో పెటీ(బ్రిటన్‌) 57.37సెకన్లు స్వర్ణం కౖెెవసం చేసుకోగా.. నెదర్లాండ్స్‌, ఇటలీ స్విమ్మర్లు రజిత, కాంస్యాలను సాధించారు. పురుషుల 4×100మీ. ఫ్రీస్టైల్‌ రిలేలో మాత్రమే అమెరికా బంగారు పతకాన్ని చేజిక్కించుకుంది. రజిత, కాంస్య పతకాలను ఇటలీ, ఆస్ట్రేలియా కైవసం చేసుకున్నాయి.