52ఏళ్ల తర్వాత చంద్రునిపై అమెరికా పరిశోధనలు

Feb 16,2024 08:03 #America
After 52 years, American researches on the moon

 ప్రైవేట్‌ మూన్‌ ల్యాండర్‌ ప్రయోగం

కేప్‌ కేన్వరాల్‌ : అపోలో మిషన్స్‌ తర్వాత అర్ధ శతాబ్దానికి పైగా సుదీర్ఘ విరామం అనంతరం అమెరికా, చంద్రుని ఉపరితలంపై పరిశోధనలు చేసేందుకు ప్రైవేట్‌ మూన్‌ ల్యాండర్‌ను పంపించింది. గురువారం తెల్లవారుజామున కేప్‌ కేన్వరాల్‌లోని కెనడీ స్పేస్‌ సెంటర్‌ నుండి ఒడిసెస్‌ ల్యాండర్‌ను తీసుకుని స్పేస్‌ ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రాకెట్‌ నింగిలోకి ఎగిసింది. ప్రైవేటు కంపెనీ రూపొందించిన అంతరిక్ష నౌకతో ఈ ప్రయోగాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా, భారత్‌, జపాన్‌ మాత్రమే చంద్రునిపై ల్యాండ్‌ అయ్యాయి. ఏ ప్రైవేటు సంస్థ కూడా ఈ ప్రాజెక్టును చేపట్టలేదు. హ్యూస్టన్‌లోని ఏరోస్పేస్‌ కంపెనీ అయిన ఇంటుటివ్‌ మెషిన్స్‌ 3,70,000 కిలోమీటర్ల దూరంలోని గమ్యాన్ని చేరుకునేందుకు ఈ మూన్‌ ల్యాండర్‌ను రూపొందించింది. ప్రత్యర్థి కంపెనీ ఆస్ట్రోబొటిక్‌ టెక్నాలజీ రూపొందించిన లూనార్‌ ల్యాండర్‌ను ప్రయోగించిన పది రోజుల తర్వాత భూమికి తిరిగి వచ్చేటప్పుడు దగ్ధమై పసిఫిక్‌ సముద్రంలో కుప్పకూలింది. ఆ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత ఈ మూన్‌ ల్యాండర్‌ ప్రయోగం జరిగింది.

➡️