డేటింగ్ యాప్‌గా X

Oct 28,2023 10:46 #dating app, #Twitter

 

X(ఒకప్పటికి ట్విట్టర్‌)ను డేటింగ్ యాప్‌గా మారబోతుంది. వచ్చే ఏడాది నుండి ఇది అమలు చేయబోతునట్లు ఎలోన్ మస్క్ ఆలోచిస్తున్నట్లు కంపెనీ సీఈవో లిండా యాకారినో చెప్పారని ఓ నివేదిక పేర్కొంది. మస్క్ X ని డిజిటల్ బ్యాంకింగ్ సాధనంగా రూపొందించాలని కూడా యోచిస్తున్నట్లు సమాచారం. మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను “ఎవ్రీథింగ్ యాప్”గా మార్చాలని భావిస్తున్నట్లు గతంలో పేర్కొన్నాడు. X కోసం కొత్త ఆదాయ మార్గాలు తప్పనిసరి అయినట్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుత బ్యాంకింగ్ వ్యవస్థతో పాటు సంక్లిష్టమైన, ఖరీదైన క్రెడిట్ కార్డ్ సిస్టమ్‌కు మెరుగైన ప్రత్యామ్నాయాన్ని వినియోగదారులకు అందించాలని మస్క్ ఆలోచిస్తున్నాడు.

➡️