ఈ సాక్సులు వేసుకుంటే సినిమా మిస్‌ అవ్వరు

Dec 4,2023 18:10 #Netflix

 

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఈ సాక్సులు వేసుకుని సినిమా చూస్తే ఆ సినిమాని మీరు మిస్‌ అవ్వరు. అదెలా అని ఆశ్చర్యపోతున్నారా? నేటి కాలంలో టెక్నాలజీ పెరుగుతోంది. దానికనుగుణంగా వ్యాపారాని తగ్గట్టుగా మార్కెట్‌ కంపెనీలు కొత్తకొత్తవి తయారుచేస్తాయి. ఈ కోవలోకి తాజాగా మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చిన ‘నెట్‌ఫ్లిక్స్‌ సాక్సులు’ వచ్చి చేరతాయి. ఈ సాక్సులకున్న ప్రత్యేకత ఏంటంటే… వీటిని ధరించి సినిమా చూస్తూ చూస్తూ.. మధ్యలో నిద్రపోయినా ఆ సినిమాను మీరు మిస్‌ అవ్వరు. అదెలా అని ఆశ్చర్యపోతున్నారా? చాలామంది వినియోగదారులు నెటిఫ్లిక్స్‌్‌లో సినిమాగానీ, ప్రోగ్రామ్‌ గానీ చూస్తూ నిద్రపోతే.. ఆ మూవీని లేదా ప్రోగ్రామ్‌ని మిస్‌ అవుతారు. వినియోగదారులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకే మార్కెట్‌లోకి ఈ సాక్సులు అందుబాటులోకి వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా సినిమాలు చూసేటప్పుడు ఈ సాక్సులను కాళ్లను ధరించి చూడాలి. ఇలా చూస్తున్నప్పుడు మధ్యలో నిద్రవస్తే నిద్రపోతే.. ఈ సాక్సుల్లోని సెన్సార్లు.. ఆ ప్రోగ్రామ్‌ని ఆపేస్తాయి. దీంతో మీరు మళ్లీ నిద్రలేచిన తర్వాత మీరు ఎక్కడ చూడడం ఆపేశారో.. అక్కడి నుంచి మళ్లీ కంటిన్యూ అవుతుంది. మీరు టీవీ చూస్తున్నప్పుడు కూడా ఇలా సాక్సులు వేసుకుని చూస్తూ నిద్రపోయినా.. వీటిలోని సెన్సార్లు టీవీని ఆపేస్తాయి. ఈ సాక్సులు మీ కదలికలను దష్టిలో ఉంచుకుని పనిచేస్తాయి. ఒకవేళ టీవీ చూసేటప్పుడు కదలకుండా అలానే కూర్చున్నా.. అవి టీవీని ఆపేయొచ్చు. కొన్ని సందర్భాల్లో మీకు ఇలాంటి సమస్యలు కూడా ఎదురుకావచ్చు.

➡️