Grok: చాట్‌బాట్ గ్రోక్ దుర్వినియోగంపై ఐటి శాఖ పరిశీలన

Mar 20,2025 08:22 #Artificial Intelligence, #Grok, #Misuse

ఇటీవల ఎఐ చాట్‌బాట్ గ్రోక్ హిందీ యాసను, అభ్యంతరకరమైన ప్రతిస్పందనలను ఇచ్చిన సంఘటనపై సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ తో సంప్రదింపులు జరుపుతోందని, ఈ సమస్యను పరిశీలిస్తుందని వర్గాలు తెలిపాయి. భాషను దుర్వినియోగించి ఉపయోగించడానికి దారితీసిన అంశాలను మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుందని వారు తెలిపారు. ఇలా ఎందుకు జరిగిందో, సమస్యలు ఏమిటో తెలుసుకోవడానికి మంత్రిత్వ శాఖ ఎక్స్ తో మాట్లాడుతున్నారు. ఐటీ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని పరిశీలిస్తోందని వారు జోడించారు. ఒక ఎక్స్ వినియోగదారుడు గ్రోక్ ను సమాచారం అందించమని అభ్యర్థించినప్పుడు పరిహాసం ఎదురైంది. దీంతో వినియోగదారు కొన్ని కఠినమైన వ్యాఖ్యలతో స్పందించాడు. దీనికి ధీటుగా గ్రోక్‌ అంతే స్వరంతో, దూషణతో కూడిన ప్రతిస్పందనను ఇచ్చింది. దీంతో ఈ వివాదం రాజుకుంది. ఫిల్టర్ చేయని ప్రతిస్పందనలు వినియోగదారులను కలవరపెట్టాయి. ఎఐ భవిష్యత్తు గురించి సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.

➡️