సైటెక్ : ప్రేమికులు తరచూ ‘ నా గుండె చప్పుడు నువ్వే ‘ అంటూ వారి ప్రేమను ఎన్నో రకాలుగా తెలుపుతుంటారు. హార్ట్ బీట్ ప్లే చేసే టెడ్డీలు, మ్యూజిక్ వాచ్‌లు ఇలా … ఎన్నో రకాల బహుమతులిస్తూ వారి ప్రేమను వ్యక్తపరుస్తుంటారు.. మరి… ప్రేమించిన వ్యక్తి గుండె చప్పుడు నిజంగానే వినిపిస్తే ..! అదెలా స్టెతస్కోపు వాడాలి అంటారా ? కాదండీ… కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ లవర్స్ కోసం లవ్ లాకెట్ ను తెచ్చింది. మీ ప్రియమైనవారి గుండె చప్పుడును ఎల్లప్పుడూ మీరు వినేందుకు వీలుగా రూపొందించినదే ఈ లవ్ లాకెట్. దీనిని ధరించిన వారు తమ గుండె చప్పుడును తమ ప్రియమైన వ్యక్తితో పంచుకోవచ్చు. ఇందుకోసం రెండు లాకెట్లను నేరుగా ఇద్దరు వాడుకోవచ్చు. ఒకరి వద్దే లాకెట్ ఉంటే, మొబైల్ యాప్‌లో వారి కాంటక్ట్‌ను సేవ్ చేసుకొని వాడాలి. లాకెట్‌లో ఉండే బటన్‌ను నొక్కినప్పుడు, మీరు ఎంచుకున్న వారికి మీ గుండె చప్పుడు ఆడియోను చేరవేస్తుంది. ధర రూ.పది నుంచి ఇరవై వేల వరకు ఉంది. వివిధ రంగుల్లో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.
