యూపీఐ క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తున్నారా?! ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది

Jan 19,2024 16:57 #qr code scanner, #Technology

ఇంటర్నెట్‌డెస్క్‌ : టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో యూపిఐ యాప్స్‌ వినియోగం బాగా పెరుగుతోంది. దీంతో ఎక్కడికెళ్లినా.. జేబులో డబ్బుల కంటే ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ పెట్టుకుని వెళుతున్నారు. కిరాణా వస్తువుల దగ్గర నుంచి.. కూరగాయలు, టిఫిన్‌ వరకూ అన్నీటికీ.. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి పేమెంట్స్‌ చేస్తున్నారు. దీంతో సైబర్‌ నేరగాళ్లు యూజర్ల వ్యక్తిగత వివిరాలు తెలుసకుని, డబ్బులు కాజేసే కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఈ సైబర్‌ నేరాల్ని తగ్గించాలంటే క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటిస్తే మంచిది.

– బహిరంగ ప్రదేశాల్లో ఉండే క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్‌ చేయకూడదు.

– క్యూఆర్‌ కోడ్‌లు మీకు తెలియని వ్యక్తుల నుంచి సందేశం లేదా ఇమెయిల్‌ రూపంలో వస్తే వాటిని స్కాన్‌ చేయకూడదు.- సోషల్‌ మీడియాలో కనిపించే క్యూఆర్‌ కోడ్‌ల పట్ల కూడా జాగ్రత్త వహించాలి.

– లింక్‌ కలిగి ఉన్న క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేసేముందు, యూఆర్‌ఎల్‌ చెక్‌ చేసుకోవాలి.

– క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయగానే వెబ్‌సైట్‌లోకి తీసుకెళ్తే.. వాటికి దూరంగా ఉండడం మంచిది.

–  సైబర్‌ మోసాలను నివారించడానికి బిల్డ్‌ ఇన్‌ సెక్యూరిటీ ఉన్న క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం మంచిది.

– మీ డిజిటల్‌ అకౌంట్స్‌ పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ షేర్‌ చేసుకోకూడదు.

➡️