ఆదిత్య-ఎల్‌ 1లో రికార్డయిన సౌరగాలులు..

Dec 3,2023 11:16 #Aditya-L1, #recorded, #Solar winds
  • ఫొటో షేర్‌ చేసిన ఇస్రో

బెంగళూరు : సూర్యుడిపై అధ్యయనంలో కీలక ఘట్టం చోటుచేసుకున్నది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు రోదసిలోకి దూసుకెళ్లిన ‘ఆదిత్య-ఎల్‌ 1 తన ప్రయాణంలో మరో మైలురాయిని అందుకుంది. ఈ ఉపగ్రహంలోని ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పరిమెంట్‌ పేలోడ్‌ తన ఆపరేషన్స్‌ను ప్రారంభించిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వెల్లడించింది. ఈ పేలోడ్‌లోని రెండు పరికరాలు పరిశోధనలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయని, ఇవి సౌర గాలులను అధ్యయనం చేస్తున్నాయని తెలిపింది.

➡️