వాషింగ్టన్ : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో తొమ్మిది మాసాలుగా చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ వ్యోమగామిలను మంగళవారం (మార్చి 18) సాయంత్రం భూమికి తిరిగి తీసుకువస్తారని నాసా తెలిపింది. వీరిద్దరూ మరో అమెరికన్ వ్యోమగామి, ఒక రష్యన్ వ్యోమగామితో పాటు స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్రాఫ్ట్‌లో ఆదివారం తెల్లవారుజామున ఐఎస్ఎస్ కి తరలించారు.
