హమాస్‌తో ఇజ్రాయెల్ యుద్ధంలో గాజాలో మరణించిన పాలస్తీనియన్ల కోసం మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో అనధికారిక జాగరణ ఏర్పాటు చేసిన ఇద్దరు ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ తొలగించింది. వాషింగ్టన్‌లోని రెడ్‌మండ్‌లోని మైక్రోసాఫ్ట్ క్యాంపస్‌లో వారు నిర్వహించిన లంచ్‌టైమ్ ఈవెంట్ తర్వాత ఫోన్ కాల్ ద్వారా తమను తొలగించారని ఇద్దరు ఉద్యోగులు అసోసియేటెడ్ ప్రెస్‌తో చెప్పారు. “నో అజూర్ ఫర్ అపార్థీడ్” అనే ఉద్యోగుల కూటమిలో సభ్యులుగా ఉన్నా ఇద్దరు కార్మికులు ఇజ్రాయిల్ ప్రభుత్వానికి మైక్రోసాఫ్ట్ తన క్లౌడ్-కంప్యూటింగ్ టెక్నాలజీని విక్రయించడాన్ని వ్యతిరేకించారు. గాజాలో పాలస్తీనా మారణహోమం బాధితులకు సానుభూతిని తెలుపడం, మారణహోమానికి మైక్రోసాఫ్ట్ సహకరించడంపై ఆందోళన చెందుతూ ఈ జాగృతి యొక్క ఉద్దేశ్యమని తొలగించబడిన ఒక ఉద్యోగి హోసామ్ నాస్ర్ చెప్పారు.