వాషింగ్టన్ : జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా అమెరికాలో నిషేధించిన టిక్‌టాక్ సేవలు తిరిగి ప్రారంభించబోతున్నారు. ఈ ఘనత సోమవారం అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న డొనాల్డ్ ట్రంప్ ది అని టిక్‌టాక్ పేర్కొంది. అయితే టిక్‌టాక్ కంపెనీలో సుమారు 50 శాతం వాటా యూఎస్ పెట్టుబడిదారుల చేతిలో ఉండేలా కండిషన్ తో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఆ సేవలను తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించారు. తద్వారా అమెరికా భద్రతకు సంబంధించి మరో ఒప్పందం చేసుకోనున్నారు. ఉమ్మడి వెంచర్‌లో 50 శాతం వాటా ఉండాలి. దీనికి వారు ఒకే అంటే తాము టిక్‌టాక్‌ను రక్షిస్తామని ఆయన వెల్లడించారు. అప్పుడు టిక్ టాక్ మరింత అద్భుతంగా నడిపించే వారి చేతుల్లోకి వెళుతుందన్నాడు. దాంతో మేము టిక్ టాక్ సేవలకు అనుమతిస్తామని తన సోషల్ మీడియా ట్రూత్‌లో డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చాడు.
చైనా యజమానులైన బైట్‌డాన్స్ తన యుఎస్ అనుబంధ సంస్థను చైనీస్ కాని కొనుగోలుదారులకు విక్రయించడానికి గడువు సమీపిస్తున్నందున వీడియో-షేరింగ్ యాప్ శనివారం యునైటెడ్ స్టేట్స్‌లో మూసివేయబడిన సంగతి విదితమే.