వాషింగ్టన్ : ఎలన్ మస్క్‌కి చెందిన సోషల్‌మీడియా ‘ఎక్స్’ సేవలు కొంతసేపు నిలిచిపోవడంతో గందరగోళానికి దారితీసింది. సోమవారం మధ్యాహ్నం 3.20 గంటల నుండి సర్వన్ డౌన్ అయింది. పోస్టులు లోడ్ కాకపోవడం, టైమ్‌లైన్‌ను రీఫ్రెష్ చేయలేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా పలువురు వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్స్ యాప్‌తో పాటు వెబ్‌సైట్ కూడా డౌన్ అయినట్లు వినియోగదారులు పేర్కొన్నారు. గరిష్టంగా 2,500 ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిలో 54 శాతం ఫిర్యాదులు వెబ్‌సైట్‌కు చెందినవి కాగా, యాప్ గురించి 42 శాతం ఫిర్యాదుల ఉన్నాయి. సేవలు నిలిచిపోవడానికి గల కారణం తెలియలేదు. గతేడాది ఆగస్టులో కూడా ఎక్స్ ఇదే విధమైన అంతరాయాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
