WhatsApp – ఆ యాప్‌ లింక్‌ క్లిక్‌ చేస్తే హ్యాక్‌ అవ్వడం ఖాయం..!

Jun 17,2024 11:17 #app, #click link, #hacked, #whatsapp

అమరావతి : టెక్నాలజీ ఎంత వేగంగా దూసుకుపోతుందో… సైబర్‌ నేరగాళ్ల మోసాలు కూడా అంతే వేగంగా టెక్నాలజీ ఆధారంగా ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్‌ గ్రూప్‌లో వచ్చే లింక్‌లను క్లిక్‌ చేసుకుంటూపోతే … అది హ్యాక్‌ అవ్వడం ఖాయం..! అంతేకాదు మీ ఫోన్‌ నెంబరుతో ఇతరులకు సందేశాలు పంపించే ప్రమాదం కూడా ఉంది. సిరికొండ మండలం సోంపెల్లి గ్రామంలో దాదాపుగా 10 మందికి పైగా వాట్సాప్‌ ఖాతాలు హ్యాక్‌ అయి లబోదిబోమంటున్నారు. ఆ గ్రామానికి చెందిన యువకులు తమ గ్రూపులో వచ్చిన పిఎం కిసాన్‌ యాప్‌ లింక్‌ను క్లిక్‌ చేశారు. కొద్ది సేపట్లోనే వారి వాట్సాప్‌ పూర్తిగా అవతలి వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది. యాప్‌ ఎంతకీ ఓపెన్‌ కావడం లేదు. ఆ యాప్‌ను ఇతరులు వాడుతున్నారు. వివిధ గ్రూపులకు సందేశాలు ఫార్వర్డ్‌ చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఈ విషయమై సైబర్‌ క్రైం డీఎస్పీ హసీద్‌ ఉల్లాను వివరణ కోరగా … మొబైల్‌లో వచ్చే యాప్‌లపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పిఎం కిసాన్‌ యాప్‌లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్‌ చేయొద్దన్నారు. ఏదైనా సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

➡️