భూమి ఫోటో తీసిన విలియం ఆండర్స్ మృతి

వాషింగ్టన్ : అందమైన భూమి ఫోటో తీసిన విలియం ఆండర్స్ (90) విమాన ప్రమాదంలో శుక్రవారం మరణించాడు. 1968లోని అపోలో-8 ద్వారా  చంద్రుడి చుట్టూ తిరిగి వచ్చిన ముగ్గురు వ్యోమగామిలలో విలియం విలియం ఒకరు. విలియం ప్రయాణిస్తున్న చిన్న విమానం సీటెల్‌కు ఉత్తరాన ఓర్కా మరియు జోన్స్ దీవుల మధ్య సముద్రంలో కూలిపోయింది. ఈ విషయాన్ని ఆయన కుమారుడు మీడియాకు తెలిపారు. అంతరిక్షం నుండి గ్రహం నీడ భూమిపై పడుతూ సగ భాగం చీకటి, సగ భాగం నీలిరంగు పాలరాయిగా కనిపిస్తున్న ”ఎర్త్‌రైజ్” ఫోటోగా ప్రసిద్ది చెందింది విలియం తీసిన ఫోటో. ఇదే అంతరిక్షం నుండి తీసిన భూమి యొక్క మొదటి కలర్ ఫోటో కావడం విశేషం.  విలియం 1955లో యుఎస్ వైమానిక దళంలో పైలట్‌గా తన వృత్తిని ప్రారంభించారు.  యుఎస్ ఏరోనాటిక్స్ మరియు స్పేస్ కౌన్సిల్ యొక్క కార్యదర్శిగా, న్యూక్లియర్ రెగ్యులేటరీ కమిషన్ కిమొదటి ఛైర్మన్‌గా పనిచేశారు.

➡️