అంతరిక్ష వాసంలో ప్రపంచ రికార్డు

Jun 5,2024 21:57 #russia, #Space
  •  ఎక్కువ రోజులు గడిపిన వ్యక్తిగా రష్యా వ్యోమగామి

మాస్కో : అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపిన వ్యక్తిగా రష్యా వ్యోమగామి ఒలేగ్‌ కోనొనెంకో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. గతంలో 878 రోజులు గడిపిన గెన్నాడి పడల్కా రికార్డును ఒలేగ్‌ అధిగమించాడని రష్యా అంతరిక్ష సంస్థ తెలిపింది. కోనొనెంకో జూన్‌ 5న అంతరిక్షంలో మొత్తం 1,000 రోజులకు చేరుకుంటారని తెలిపింది. సెప్టెంబర్‌ చివరి నాటికి అతను 1,110 రోజులను పూర్తి చేస్తాడని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. ”నేను నాకిష్టమైన పనిని చేయడానికి అంతరిక్షంలోకి వెళతాను, రికార్డులు నెలకొల్పడానికి కాదు” అని కొనోనెంకో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) నుండి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అతను భూమి నుండి 263 మైళ్ళు (423 కిమీ) కక్ష్యలో ఉన్నాడు. ”నా విజయాలన్నింటికి నేను గర్వపడుతున్నాను, కానీ అంతరిక్షంలో మానవుడు గడిపిన మొత్తం కాలానికి సంబంధించిన రికార్డు ఇప్పటికీ రష్యన్‌ వ్యోమగామి చేతిలో ఉన్నందుకు నేను మరింత గర్వపడుతున్నాను.” అని పేర్కొన్నారు.

➡️