Jun 23,2022 18:26

శ్రీ ధనలక్ష్మి మూవీస్‌ పతాకంపై.. ఎమ్‌.వినయ్ బాబు దర్శకత్వంలో బీసు చందర్‌ గౌడ్‌ నిర్మిస్తోన్న చిత్రం 'సీతారామపురంలో ఒక ప్రేమ జంట'. విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే ఈ ప్రేమకథా చిత్రంతో రణధీర్‌, నందిని రెడ్డి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం టీజర్‌ని హైదరాబాద్‌, ప్రసాద్‌ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో మినిస్టర్‌ శ్రీనివాస్‌ గౌడ్‌ విడుదల చేశారు. ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ చిత్రంగా దర్శక నిర్మాతలు తెరకెక్కించారు. కొత్త నటీనటులైనా అద్భుతంగా నటించారని దర్శకుడు అన్నారు. ప్రేమించడం కాదు.. ఆ ప్రేమను నిలబెట్టుకోవాలన్న అంశాన్ని ఈ చిత్రం ద్వారా చూపిస్తున్నామన్నారు.