Aug 18,2022 21:04

ముంబయి :  దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం ఆద్యంతం ఊగిసలాటకు గురైయ్యాయి. ఆరంభంలో లాభాల స్వీకరణతో సూచీలు దాదాపు 300పాయింట్లు నష్టపోయాయి. చివరి అరగంటలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో తుదకు స్వల్ప లాభాలతో ముగిశాయి. చమురు ధరల్లో తగ్గుదల, రూపాయి విలువ స్థిరంగా చోటు చేసుకోవడం ద్వారా తుదకు మద్దతు లభించింది. చివరికి బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 58 పాయింట్లు పెరిగి 60,298కు చేరింది. ఇంట్రాడేలో 60,341-59,946 మధ్య కదలాడింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 17956 వద్ద ముగిసింది.