Aug 19,2022 14:59

ప్రజాశక్తి-రైల్వేకోడూరు: ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బందును జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు జాన్ ప్రసాద్ అన్నారు. శుక్రవారం బందుకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా జాన్ ప్రసాద్ మాట్లాడుతూ అంతేకాకుండా 3, 4, 5 తరగతుల ను హైస్కూల్లో విలీనం ఆపాలని, జీవో 84, 85, 117, 128 రద్దు చేయాలని డిమాండు చేశారు. పాఠ్య, నోట్ పుస్తకాలు విద్యాకానుక, యూనిఫారాలు పూర్తిస్థాయిలో అందించాలని, సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచాలని, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు అందరికీ అందించాలని కోరారు. జీవో నెంబర్ 77 రద్దుచేసి పీజీ విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లించాలని, కామన్ పీజీ ప్రవేశ పరీక్ష రద్దు చేయాలని అన్నారు. కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న 25 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బైజూస్ ఒప్పందాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వమే ఉచిత టాబ్ లు అందించాలని, విశ్వవిద్యాలయాల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, పెంచిన బస్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ  సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర పిలుపు మేరకు 23న జరిగే బందును ప్రతి ఒక్క విద్యార్థిని, విద్యార్థులు భావి భారత పౌరులు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు, కార్యదర్శి చందు, రిషికేశ్ కమిటీ సభ్యులు పవన్, బాబు పాల్గొన్నారు.