May 29,2023 16:13

షాంఘై  :   షాంఘైలో సోమవారం అత్యంత వేడిగా ఉండే మే డేని నమోదు చేసింది. గడిచిన 100 ఏళ్లలో సోమవారం రికార్డుస్థాయిలో అత్యంత గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు స్థానిక మెటరలాజికల్‌ సర్వే పేర్కొంది. సోమవారం మధ్యాహ్నం 13.09 నిమిషాలకు జియాహుయి  స్టేషన్‌లో 36.1 డిగ్రీల సెల్సియస్‌ (97 డిగ్రీస్‌ ఫారెన్‌ హీట్‌) ఉష్ణోగ్రత నమోదైందని, గత 100 ఏళ్లలో మేలో నమోదైన ఉష్ణోగ్రతల రికార్డును బద్దలు కొట్టినట్లు షాంఘై అధికారిక ఖాతాలో పేర్కొన్నారు. మధ్యాహ్నం తరువాత సెంట్రల్‌ షాంఘైలోని మెట్రో స్టేషన్‌లో ఉష్ణోగ్రత 36.7 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగిందని తూర్పు చైనా నగరానికి చెందిన మెటరలాజికల్‌ సర్వే తెలిపింది. గతంలో వరుసగా 1876, 1903, 1915, 2018లో 35.7 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. గ్రీన్‌ హౌస్‌ వాయువులు, ఎలినినో ప్రభావంతో 2023-2027 మధ్య ఐదేళ్ల కాలంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని ఐరాస హెచ్చరించిన సంగతి తెలిసిందే.