
వాషింగ్టన్ : అమెరికాలో గన్ కల్చర్ పెట్రేగిపోతోంది. మంగళవారం అర్థరాత్రి వాల్‌మార్ట్ స్టోర్‌పై ఓ దుండుగుడు పలుమార్లు కాల్పులు జరిపాడు. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. వాల్‌మార్ట్‌లో పనిచేసే వ్యక్తి ఈ కాల్పులకు పాల్పడినట్లు ని వర్జీనియా స్టేట్ సెనెటర్ లూయిస్ లుకాస్ పేర్కొన్నారు. ఈఘటనలో పది మంది మరణించారని, మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అన్నారు. దుండగుడు తనని తాను కాల్చుకున్నాడని చెప్పారు. సామ్స్ సర్కిల్లోని వాల్మార్ట వద్ద కాల్పులు జరిగినట్లు పోలీసులు కూడా ధృవీకరించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.