దేశం

Feb 11,2024 12:23 #Poetry

నా దేశం నాకు చాలా ఇష్టం

మా దేశంలో ఎన్నో ఆప్యాయతలు

మరెన్నో అనురాగాలు

అనుబంధాలు, ఆనందాలు అందుకే

నా దేశం అంటే నాకు చాలా ఇష్టం

కులాలు ఎన్నైనా

మతాలు ఎన్నైనా

భాషలు ఎన్నైనా

కష్టం వస్తే అందరూ ఏకమవుతారు

అందమైన బృందావనం మన దేశం

కులమతాలకు అతీతంగా

అన్నదమ్ముల అనుబంధం

మనసులో మెదిలే

అందమైన పొదరిల్లు మన దేశం !

 

  • చంద్రిక. కె, 8వ తరగతి, అరవింద మోడల్‌ స్కూల్‌, మంగళగిరి, గుంటూరు జిల్లా.
➡️