విజ్ఞాన వినోదాల కలయిక

నవంబరు 19 నుంచి 21 వరకు విశాఖ బాలోత్సవం సెంట్‌ ఆంథోనీ ప్రైమరీలో జరిగింది. ఆద్యంతం ఉల్లాసం ఉత్తేజం నింపింది. పిల్లలు దేనినైనా సూక్ష్మంగా గ్రహిస్తారు.. నేర్చుకోవడానికి ఇష్టపడతారు.. సున్నితంగా పరిశీలిస్తుంటారు అనేదానికి ఆహార్యాన్ని ఇచ్చింది బాలోత్సవం. ఎదుటి వారికి సేవ చేసే గుణం వున్న వారే దేవతలు, పరోపకారులే ఉత్తమ పౌరులు.. ఇది ఇక్కడ పాఠశాలను వేదికగా ఇచ్చిన యాజమాన్యం, ఎటువంటి పారితోషికం ఆశించకుండా పని చేసిన న్యాయ నిర్ణేతలు, వాలంటీర్లు, ఆహ్వాన సంఘం రూపాలలో వ్యక్తమైనది. దాదాపుగా ఎనిమిది వేలమంది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమం గతసారి కంటే భిన్నంగా, వినూత్నంగా జరిగింది. ఈ ఉత్సవం వారిలో సామాజిక స్ప ృహను పెంచేదిగా ఉంది. వక్తృత్వంలో తెలుగు, ఇంగ్లీష్‌లో జరిగిన పోటీలలో పంచతంత్ర కథలు వాటి ప్రభావం, మన జీవితంపై సెల్‌ఫోన్‌ ప్రభావం, గ్లోబల్‌ వార్మింగ్‌ మానవాళి పై ప్రభావం, కృత్రిమ మేధస్సు, జీవితంలో సైంటిఫిక్‌ టెంపర్‌ అంశాలుగా జరిగాయి. తెలుగు కథా రచన కంట్రోల్‌ తప్పిన రోబో, నేను ఒక శాస్త్రవేత్త అయితే.. (కల్పిత కథ) జరిగాయి. మూఢనమ్మకం- సైన్స్‌, టైం ట్రావెల్‌ (కాల యాత్ర), మానవ క్లోనింగ్‌, పే బాక్‌ టు సొసైటీ (సమాజానికి తిరిగి ఇవ్వడం), తెలుగు కవితా రచన సీనియర్సకి సెల్‌ఫోన్‌ (దూరవాణి), ప్రకృతి, శాస్త్రం గురించి ఒక కవిత, స్కూల్‌ లైఫ్‌. డిబేట్‌ సీనియర్స్‌ కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌) అనుకూల ప్రతికూల వాదనలు. తెలుగులో మాట్లాడడంలో స్నేహం, సమాజ సేవ వంటి అంశాలను ఇవ్వడం జరిగింది. వీటితో పాటు లఘు నాటికలు, జానపద, దేశభక్తి, ఏక పాత్రాభినయం, క్లాసికల్‌, మూకాభినయం, వాయిద్య పరికరాల సంగీతం, బృంద నృత్యం, దేశభక్తి గీతాలాపన, జానపద, శాస్త్రీయ, కోలాటం వంటి నృత్యాలు ఇలా 84 ఈవెంట్స్‌ జరిగాయి. అన్ని అంశాలలో పిల్లలు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. వందల ఏళ్ల నాటి మర్రి చెట్టు క్రింద వనవిహార యాత్రని తలపించేలా ఆనందానికి ఆకాశమే హద్దుగా జరిగింది.

డా. కె.రమాప్రభ 
ఉపాధ్యక్షులు, విశాఖ బాలోత్సవం,
9492348428

➡️