అంబేద్కర్‌ హైకూలు

Apr 13,2025 13:30 #Poetry

ఎక్కడుంచాలో పుట్టుక నిర్ణయిస్తే
అది నవ సమ సమాజమా
అంబేద్కర్‌ సూటి ప్రశ్న!
రేయింబవళ్ళూ ఒకటే కల
అంబేద్కర్‌ ది
సమానత్వ స్వప్నం !

విశాల హృదయంతో చూస్తే
సమన్యాయం సమానత్వం తరువాతే
అంబేద్కర్‌ ది దూరదృష్టి !

ఏ రాజ్యం సరిచెయ్యలేకపోయున
ఎక్కువ తక్కువులు
అంబేద్కర్‌ రాజ్యాంగం సరిచేస్తుంది !

తన కోసం కాదు
జాతి కోసం తపించాడు
అంబేద్కర్‌ అమర జీవి !

తిప్పాన హరిరెడ్డి
94938 32412

➡️