పరిరక్షణకు ‘పసి’చిత్రాలు..

Jun 9,2024 11:51 #Sneha

దాదాపు రెండొదల మంది చిన్నారులు సీతాకోక చిలుకల్లా ఒక్కచోట చేరి – కుంచలు, రంగులు చేబూని.. అద్బుత చిత్రకళను ప్రదర్శించారు. వీళ్లంతా ‘పర్యావరణం పరిరక్షణ అంశం’పై ఆలోచింపజేసే చిత్రాలను చిత్రించారు. తక్కువ వ్యవధిలోనే అద్భుతమైన చిత్రాలను వేసి బాల, బాలికలు ఆహుతుల్ని అబ్బురపరిచారు. చిట్టిపొట్టి చిన్నారులు వేసిన ఈ చిత్రాలను చూసి, పెద్దలంతా బోలెడు అభినందనలు తెలియజేశారు. ఈ చిత్ర పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.
పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం, పోరం ఫర్‌ ఆర్టిస్ట్‌, వన్‌ ఎర్త్‌ వన్‌ లైఫ్‌ సంయుక్తంగా ఈ పోటీలను విజయవాడలో జరిపారు.

 

➡️