బాపు బొమ్మ

Feb 2,2025 10:47 #Bapu doll, #Sneha

విద్వాన్‌ విశ్వంగారు
విశిష్ట కవి వరేణ్యులు
ఆంధ్రప్రభ వీక్లీకి
ఆయన సంపాదకులు!!

ఆంధ్రప్రభ వీక్లీలొ
అచ్చవ్వాలి కథయని
ముళ్లపూడి సరాసరి
వెళ్లి అడిగె విశ్వంని!

”మొట్టమొదటి కథ నాది
బొమ్మ ‘బాపు’ వేశాడు!
చదివి ఎలా వున్నదో
సత్వరమే చెప్పండి!!

వెను వెంటనె కథ చదివి
విశ్వంగారిట్లనిరి,
”ఇడ్లీ కన్నపచ్చడె
ఎంతో బాగుందండి!”

బాపు బొమ్మ, కథకన్న
బాగుందను భావమది!
బాపురేఖలెవరికైన
బాపురె అనిపించు గద!!

– ‘బాలబంధు’ అలపర్తి వెంకటసుబ్బారావు
(కేంద్ర సాహిత్య అకాడమీ
బాలసాహిత్య పురస్కార గ్రహీత)
9440805001

➡️