అల్లరి మస్తుగ చేసేస్తాం
ఆటలు ఎన్నో ఆడేస్తాం
గందరగోళం చేసేస్తాం
గజిబిజిగా కాలం గడిపేస్తాం
ఉడుతల్లాగా ఎగిరేస్తాం
కప్పల్లాగా గెంతేస్తాం
గుర్రంలాగా పరిగెడతాం
కోతి చేష్టలు చేస్తుంటాం
పక్షుల్లాగా రెక్కలిప్పుతాం
జెండాలాగా రెపరెపలాడుతు
అలలై మేము ఎగసిపడతాం
కాలువలా ఒంపులు పోతాం
అష్టాచెమ్మా ఆటలాడుతాం
కోతుల్లాగా కొమ్మలెక్కుతాం
కోయిలలాగా పాట పాడుతాం
వసంతంలా నవ్వుతుంటాం
గిలిగింతలు పెట్టుకుంటాం
గిలకతో గిర్రున తిరుగుతాం
గిచ్చులతో గొడవలు పడతాం
గురువుకు బాగా భయపడతాం
అమ్మానాన్నతో హాయిగుంటాం
అక్కచెల్లెళ్లతో కలిసుంటాం
స్నేహాన్ని చక్కగా స్వీకరిస్తాం
అందరితో ఒద్దికగా మసలుతాం
మేమే కదా చిచ్చర పిడుగులం
చేప పిల్లలా జారిపోతుంటాం
నక్క తెలివితో తిరుగుతుంటాం
టక్కరి దొంగను పట్టేస్తాం
మల్లెపువ్వులా దుస్తులు వేస్తాం
హంసలాగా నడుస్తూ పోతాం
పావురమల్లే శాంతిగ వుంటాం
భూమాతలా సహనంతో వుంటాం
చెట్టు మొదల్లో దాక్కుంటాం
కాయలు ఎంచక్కా తినిపెడతాం
సాధు జంతువును ప్రేమిస్తాం
విశ్వాసానికి కట్టుబడి వుంటాం
పిల్లలం మేము పిడుగులం
బుల్లి బుల్లి బుజ్జాయిలం
అల్లిబిల్లి ఆకతాయిలం
చిట్టి పొట్టి గట్టి పాపలం
నరెద్దుల రాజారెడ్డి
9666016636