పిల్లలు, పిల్లలు, పిల్లలు
పిల్లలు పిల్లలు పిల్లలు
విరిసిన కుసుమపు రేకులు
రాత్రి చందమామ కాంతులు
తెలతెలవారి వెలుగులు
తియతియ్యని పాల నురుగులు
చెంగు చెంగుమనే లేగదూడలు
చలచల్లని పిల్లగాలులు
బడిలోని పలకా బలపాలు
పంట చేలలోని పైరులు
భవిష్యత్కాలపు సిరులు
కొమ్మనపూసే విరులు
విరులు కార్చే తేనె ఊటలు
బాల్యపు తీపు గురుతులు
మరచిపోని కాకి ఎంగిళ్లు
అలుపురాని పరుగులు
ఇంకా సరిగాదిద్దని అక్షరాలు
అమ్మ చేత ఊయలలు
అమ్మనోట కమ్మని లాలిపాటలు
వర్షపు నీటి చినుకులు
యెక్కడెక్కడికో ఎగిరే
గువ్వలు, గొరవంకలు
దేశపు తలరాతలు
– రాళ్లబండి సంగంనాయుడు
9490935258