ఒక ఆదివారం హాస్టల్ పిల్లలందరం కలిసి అడివినక్కలంలో ఉన్న ‘లివింగ్ స్కూలు’ దగ్గరికి వెళ్ళాము. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ రెండవ ఆదివారంలో ఈ స్కూల్లో ‘మా ఊరు’ అనే కార్యక్రమం జరుగుతుంది. ఆ స్కూల్లోని పిల్లలందరూ కూడా మంచిగా ఎవరి పనులు వాళ్లే చేసుకుంటారు. చాలా డిసిప్లిన్‌గా ఉంటారు. మేం వెళ్లగానే అక్కడ చెట్టు కింద వాళ్ళు చేసినవన్నీ కూడా పెట్టారు. మేము వరుసగా అన్నీ చూసుకుంటూ చివరికి వాళ్ళ హాస్టల్ దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు హాస్టల్ కూడా చక్కగా చూడడానికి చాలా బాగుంది. అక్కడ వాళ్ళు తాగడానికి మజ్జిగ, రాగి జావా, టీ ఇచ్చారు. తర్వాత అక్కడ ఉన్న వాలీబాల్ కోర్టులో మా ఫ్రెండ్స్‌తో చాలాసేపు వాలీబాల్ ఆడుకున్నాము. మళ్లీ మధ్యాహ్నం భోజనం సమయానికి తిరిగి మా హాస్టల్‌కి వచ్చేసాము.
ఒ. గణేష్,
9వ తరగతి,
అరవింద హైస్కూల్,
కుంచనపల్లి.