మా ఊరికి సర్కస్ వచ్చింది. నేను, పార్వతి, మల్లీశ్వరి సర్కస్ చూడడానికి వెళ్ళాము. లోపల నేను, పార్వతీ పక్కపక్కనే కూర్చున్నాము. సర్కస్ మొదలుపెట్టారు. ముందుగా జోకర్ వచ్చాడు. వాడి మూతి, ముక్కు, టోపీ చూడగానే మాకు నవ్వు ఆగలేదు. వాడి పనులకు అందరూ చప్పట్లు కొట్టారు. తర్వాత ఐదుగురు అమ్మాయిలు వచ్చారు. వాళ్ళు తాళ్ళ మీద నడిచారు. తాళ్లు పట్టుకొని ఉయ్యాల ఊగుతూ ఊగుతూ తాడు వదిలేసి, ఇంకో తాడు పట్టుకున్నారు. అది చూసి పార్వతికి భలే ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత రెండు చిలకలు వాటిని ఒక బండికి కట్టి లాగించారు. సర్కస్లో అన్నిటికంటే నాకు ఏనుగులు బాగా నచ్చాయి. అవి స్టూల్ మీద కూర్చున్నాయి. అలాగే తొండంతో అందరికీ నమస్కారం పెట్టాయి. చివరికి పెద్ద పులులు, చిరుత పులులు, ఎలుక బంట్లు బంతితో ఆటలాడాయి. పులులు మండే చక్రంలో నుంచి దూకాయి, గర్జించాయి. అది చూసి పిల్లలందరం బెదిరిపోయాము. పులులు వెళ్లిపోగానే మళ్లీ జోకర్ వచ్చాడు. అందర్నీ నవ్వించాడు. చివరిగా మాకు టాటా చెప్పాడు. అందరం నవ్వుకుంటూ బయటికి వచ్చేసాము.
ఎమ్. హాసిని
4వ తరగతి,
అరవింద హైస్కూల్,
కుంచనపల్లి.