మట్టి బొమ్మలు.. గ్రీటింగ్‌ కార్డులు..

Jan 5,2025 11:12 #Sneha

ఆరోజు మా పాఠశాలలో సృజనోత్సవం జరిగింది. చాలామంది పిల్లలు చాలా ప్రోగ్రాములు చేశారు. కానీ నేను ఏ ప్రోగ్రాము చేయలేదు. అందరిలా నేనూ ఏదో ఒకటి చేయాలనుకున్నాను. సృజనోత్సవం జరుగుతున్న దగ్గర పెట్టిన మట్టితో కొంతమంది పిల్లలు బొమ్మలు చేస్తున్నారు. నేను అందులో పాల్గొని బొమ్మలు చేశాను. కొందరు కార్డుతో గ్రీటింగ్‌ చేస్తున్నారు. దీపాలు, కుర్చీలు, రకరకాల బొమ్మలు ఇలా చాలా ఉన్నాయి. నేను కూడా నాకు నచ్చిన బొమ్మను మట్టితో తయారు చేసుకున్నాను. అలాగే గ్రీటింగ్‌ కార్డు తీసుకొని దానిమీద న్యూ ఇయర్‌ కార్డు మా అమ్మ కోసం తయారు చేశాను. ఆ స్టాల్‌ దగ్గరే చాలాసేపు గడిపాను. మాకు మధ్యలో పెట్టిన స్నాక్స్‌ తిన్నాను. అందరిని చూస్తూ చల్లటి గాలిలో కూర్చొని నాకు ఆ పని చేయడం చాలా బాగా నచ్చింది. ఒకపక్క ప్రోగ్రాంలో డ్రామాలు, డ్యాన్సులు చూస్తూ మరో పక్క ఇవి చేస్తూ ఆ రోజు నేను చాలా ఆనందంగా గడిపాను.

– వై. ధనేష్‌ సాయి
7వ తరగతి,
అరవింద హైస్కూల్‌,
కుంచనపల్లి.

➡️