కల క్షణం..

Sep 29,2024 09:38 #Poetry

నీలాల నింగిని
సిగలోని నక్షత్రాల్ని చూసి
మురిసి ప్రేయసిలా భ్రమసి
ఇంతలో దట్టమైన పొగతో
నల్లటి వర్ణమై
రాక్షసిలా అగుపిస్తే
భోరునవానై కురిస్తే
ఒక్క నిమిషం
ఊరించిన ఊహల భావన
మరో నిమిషం
ఉడికించిన ఉప్పెన కామన
కల క్షణం.. ఇల రణం..

కోటం చంద్రశేఖర్‌
9492043348

➡️