కర్తవ్యం

Jan 5,2025 10:51 #Kavitha, #Sneha

రేపటి కోసం.. భవిష్యత్తు కోసం
ప్రగతి కోసం.. సాంఘిక మార్పు కోసం..
సమాజ మార్పు కోసం
బోధించడం నా బలం

నేల విముక్తికై
హక్కుల సాధనకై
ప్రజల ఆశయాల సాధనకై
అన్వేషించటం నా లక్ష్యం..

సంకెళ్లు లేని సమానత్వం
నా ఊపిరి.. నా జీవితం
నర నరాల్లో స్వేచ్ఛా గీతం
సమానత్వ విప్లవ నినాదం

మతతత్వ విష సంస్కృతిని
అజ్ఞానాన్ని ప్రశ్నించటం
విజ్ఞానాన్ని బోధించడం
చైతన్యాన్ని రగిలించటం
సమాజ బోధకుడిగా..
నా కర్తవ్యం

ఎస్‌. కె. బాజీ సైదా
8897282981

➡️