ఇరు శయ్యల ఏక రాగం

Oct 27,2024 07:59 #kavitalu, #Sneha

రె ప్పపాటు స్వప్నం నువ్వు
నిర్నిద్ర రాత్రి నేను
క్షణిక సల్లాపం కాలం
యుగాల పరితాపం జీవితం
పూలు పూయాల్సిన తోట
కన్నీళ్లుగా వలికిన పాట
ఏ పాట ఏ తోటదో మరి
ఈ శోకం ఏ రాగమో మరి
నువ్వు నువ్వుగా
నేను నేనుగా
నడుమ వేల కోసుల దూరం
తీరం చేరేదెపుడో
దాహం తీరేదెపుడో..

లోసారి సుధాకర్‌
9949946991

➡️