చదువు అంటే -వర్తమాన బతుక్కి
భవిష్యత్ బంగారు మెరుగులు దిద్దడం!
సాంఘిక దురాచారాలకి
చరమగీతం పాడడం
కులం నిగ్గు తేల్చడం
మతం మత్తు విదిల్చడం
సైన్స్‌ను నమ్మడం
మూర్ఖపు వాదనల్ని
తార్కిక వాదంతో మట్టుబెట్టడం.
చదువు అంటే..
స్వ నిర్విచిత స్వేచ్ఛావాదం!
బాలాజీ పోతుల, 8179283830