పువ్వుల స్నేహం

Nov 3,2024 09:13 #Sneha

ఒక తోటలో రెండు పువ్వులు ఎంతో స్నేహంగా ఉండేవి. అందులో ఒకటి తెలుపు రంగు, ఇంకొకటి ఎరుపు రంగు. అయితే వీటి స్నేహాన్ని చూసినా ఒక కందిరీగ అసూయ పుట్టి, వాటిని ఎలా అయినా విడదీయాలని దురాలోచనతో వాటి దగ్గరకు వెళ్ళింది.
‘అబ్బా మీ ఇద్దరూ చూడడానికి ఎంత చక్కగా ఉన్నారు. కానీ, తోటలో ఉన్న మిగిలిన పువ్వులన్నీ మీ రెండిట్లో ఒకటే అందంగా ఉన్నాయని చెబుతున్నాయి ఏంటి? ఇంతకీ మీ ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారో కనుక్కోవడానికి నేను వచ్చాను.’ అని ఆ పువ్వులతో పలికింది.
దానికి తెలుపు రంగు పువ్వు ‘అదేంటి కందిరీగా! వాళ్ళ మాటలు, వీళ్లు మాటలు వినడమెందుకు ఎదురుగానే ఉన్నావు కదా, నువ్వే చెప్పు మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారో?’ అని అంది.
దానికి కందిరీగ ‘అదేంటి అలా అడుగుతావు? ఎంతో సుకుమారంగా ఉండే నువ్వే చాలా అందంగా ఉంటావు!’ అని జవాబు ఇచ్చింది. ‘ఓ అయితే అలా అంటావా అయితే ఎంతో అందంగా ఉండే నేనే చెబుతున్నాను. నాకన్నా అందమైన పువ్వు నా స్నేహితుడు ఎరుపు రంగు పువ్వు!!’ అని పలికి ఎరుపు పువ్వు వంక చూసి పకపకా నవ్వింది.
తెలుపు రంగు మాటలను అర్థం చేసుకున్న ఎరుపు రంగు పువ్వు కందిరీగతో ‘మరి ఏమంటావు కందిరీగా!’ అని అంది. వారిద్దరు తెలివితేటలను, స్నేహాన్ని అర్థం చేసుకున్న కందిరీగ ఏమీ అనలేక తలదించుకొని, నిరాశతో అక్కడ నుండి వెళ్ళిపోయింది.

– కె. సుహాస్‌,
5వ తరగతి, అరవింద హైస్కూల్‌, కుంచనపల్లి.

➡️